గ్యాంగ్ సినిమా మాదిరి ఐటీ దాడుల

Posted on : 10/02/2018 04:51:00 pm

అన్ని చోట్లా, అన్నింట్లోనూ నకిలీలు పెరిగి పోతున్నారు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు,నకిలీ నగలు నకిలీ పోలీసులు ,నకిలీ జర్నలిస్టులు ఇవన్నీ రెగ్యులర్ గా అందరూ వినేవే ఆఖరుకి ఈ నకిలీ గొడవ ఒక ప్రముఖ వ్యక్తికి కూడా తప్తపలేదు. ఇంతకీ ఆనకిలీ గొడవేంటనేగా సూటూ బూటూ వేసుకొని మెడలో ఒక నకిలీ ఐడెంటిటీ కార్డొకటి తగిలించుకొని తగుదునమ్మా అంటూ తెగబడ్డారు మేం ఐటీ అధికారులమంటూ.

వచ్చింది కూడా తమిళనాడు మాజీమంత్రి జయలలిత మేనకోడలు దీప ఇంటికి. భారీ ఎత్తున నగలు బంగారం దోచుకోవచ్చనే ఆశతో వచ్చిన డూప్లికేట్ల ఆశలు అడియాశలయ్యాయి. కొంచెముంటే పోలీసులకు చిక్కేవారే గానీ కొంచెంలో మిస్సయ్యారు. ఐటీ అధికారులంటూ వచ్చిన వారి వ్యవహార తేడాగా ఉండటంతో ,పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సదరు డూప్లికేట్ అధికారులు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. సాక్షాత్తూ మాజీ సీఎం మేన కోడలి ఇంటికే ఐటీ అధికారులమంటూ వచ్చిన నకిలీల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


.