జేఏసీ కన్నా పవర్ ఫుల్

Posted on : 10/02/2018 07:26:00 pm

విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని కేటాయింపుల్లో సైతం ఆంధ్రప్రదేశ్ పట్ల మోదీ ప్రభుత్వం చిన్న చూపు చూసిందని ఇంటా బయట రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈవిషయంపై ఆంధ్రాకు చాలానే చేశామని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది ఒక వైపు తేదాపు సర్కారు సైతం కేంద్రం మంజూరు చేసిన నిధుల పట్ల కనీసం నోరు మెదపకపోవడంతో జన సేన అధ్యక్షుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ అనుభవం లేకనే చంద్రబాబు చెప్పిన ప్రతి అంశాన్నీ నమ్మాల్సి వచ్చిందని, చివరకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా ప్యాకేజీతో విపరీతమైన ప్రయోజనం చేకురుతుందని నమ్మబలికారని పన్ చెప్పుకొచ్చారు.

కట్ చేస్తే బడ్జెట్ అనంతరం లొసుగులన్నీ బయటపడటంతో పవన్ జేఏసీ అంశాన్ని తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం చెప్తున్న దానికి, ఇటు చంద్రబాబు మాటలకు పొంతన లేక పోవడంతో వీటిపై ప్రశ్నించేందుకు మేధావులతో కూడిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పటుకు పవన్ శ్రీకారం చుట్టారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, తెలంగాణా లో కీలక పాత్ర పోషించిన జేఏసీ మాదిరిగా ఆంధ్రాలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారయణ్, మరికొంత మంది కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తులతో కూడిన వేధిక ఏర్పాటుకు పవన్ ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో జేపీని కలవడం, మరో సీనియర్ నేత ఉండవల్లితో ఈ నెల11న భేటీ కానున్నట్లు పవన్ ప్రకటించారు.


ఆర్ధిక రంగంలో తలపండిన మేథావులు, విద్యా, సమాజిక రాజకీయ వేత్తలతో జేఎఫ్సీ ఏర్పాటు చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. విభజన చట్టంలో హామీలు ,అమలు వాటితీరుతెన్నులపై సుధీర్ఘ చర్చ లేవనెత్తాలనేది పవన్ పవన్ టార్గెట్. ఈ నివేదిక ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తాని ఆయన ప్రకటించారు. రాష్ట్ర మంతా ప్రత్యేక హోదా కోసం నినదించే టైంలో ప్రత్యేక ప్యాకేజితో రాష్ట్ర ప్రజలకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందన్న చంద్రబాబు ప్రస్తుతం కేంద్ర కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేయడమనేది అర్ధ రహితమని పవన్ మండిపడ్డాడు. పవన్ ఇప్పుడిప్పుడే తేదేపాతో జతకట్టి గతంలో చేసిన తప్పును సరిదిద్దుకునే పనిలో పడినట్లు కనబడుతున్నాడు పవన్.