ఇకపై మగాళ్ల " ఫుల్" సపోర్ట్ టిఆర్ఎస్ కే

Posted on : 10/02/2018 09:04:00 pm

పండగైనా పబ్బమైనా, చావైనా, పుట్టుకైనా తెలుగు రాష్ట్రాల్లో దావత్ ఉండి తీరాల్సిందే, పరీక్షల్లో పాసైనా పార్టీ చేసుకుంటారు, ఫెయిలైనా ఓ పెగ్గేస్తారు దేనికైనా మందు "మందే" వీటిని ఒక్కచోట ఒక్కోలా అమ్ముతారు అర్బన్ లో ఓ రేటు రూరల్ మరో రేటు అదేమంటే సిండికేట్ అంటారు. ఇకపై అలాంటి పప్పులుడకవంటోంది, తెలంగాణా అబ్కారీ శాఖ. లిక్కర్ ప్రైస్ యాప్ పేరుతో ఒక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణా ప్రభుత్వం. ఈ యాప్ ను అబ్కారీ మంత్రి పద్మారావు శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఇక పై మద్యం దుఖానాల్లో ఇష్టంవచ్చిన రేట్లకు లిక్కర్ అమ్మడానికి కుదరనే కుదరదు. ప్రతి షాపులోనూ లిక్కర్ రేట్ల పట్టిక ఉండాల్సిందే.

ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం చర్యలు తప్పవని ప్రభుత్వం వైన్ షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాప్ ద్వారా వివిధ రకాల బ్రాండ్లపై ప్రభుత్వం నిర్దేశించిన రేట్లను ఒక్క క్లిక్ తో ఇట్టే తెలుసుకోవచ్చన్న మాట.

తాజా యాప్‌తో మద్యం విక్రయందారులు ఆటలు కట్టించవచ్చు. ఏదైనా బ్రాండ్ ఆల్కహాల్‌ను ఎంఆర్‌పీ రేట్ల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు గమనిస్తే.. యాప్ ద్వారా వివరాలు తెలుసుకొని వారిని ప్రశ్నించవచ్చు. అలాంటివారిపై ఫిర్యాదు చేయడానికి యాప్‌లో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులకు జరిమానా కూడా విధించనున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ హెచ్చరించారు.

వినియోగదారుల్లో చైతన్యం కల్పించడానికే ‘లిక్కర్ ప్రైస్ యాప్‌’ను తీసుకొచ్చినట్లు మంత్రి పద్మారావు తెలిపారు. అబ్కారీ శాఖలో నిరంతర పర్యవేక్షణ, జవాబుదారీతనం కోసం సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఆ శాఖ ఇంచార్జి కమిషనర్ సోమేష్ కుమార్ చెప్పారు. ఏదేమైనా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ తో మందుబాబులు ఇకపై బారు షాపుల్లో మోసపోరన్న మాట. డబుల్ బెడ్ రూమ్ కాన్సెప్టుతో మహిళల మనసు గెలుచుకున్న టీ ఆర్ ఎస్ ఈ యాప్ ద్వారా మగాళ్ల మనసులను సైతం గెలుచుకునే ప్రయత్నం చేస్తొందని నిర్మొహమాటం లేకుండా చచప్పొచ్చు.