సినిమా రివ్యూ: తొలిప్రేమ

Posted on : 11/02/2018 10:56:00 pm

ఫిదా తో బ్లాక్బస్టర్ కొట్టిన వరుణ్ తేజ్ నటించిన TP   చిత్రం   గత శనివారం  రిలీజ్ అయింది..US లో ఒక రోజు ముందు గానే రిలీజ్ ఐన ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుంది .. చూద్దాం ఎలా ఉందో...  

ఆదిత్య(వరుణ్ తేజ్) ఎంసెట్ అయిపోయి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వటానికి ముందే ట్రైన్ లో..మొదటి చూపులోనే వర్ష (రాశి ఖన్నా ) లవ్ లో పడతాడు ..ట్రైన్ జర్నీ లో మిస్ ఐన వర్షని , తన కాలేజీ లోనే జాయిన్ అయింది అని తెలుసుకొని, తనతో ఐ లవ్ యు చేపించుకోడానికి చాలా కష్టాలు పడ్తాడూ ..తరువాత ఒక అనుకోని సంఘటన వాళ్ళ ఒకరినిఒకరు అపార్ధం చేసుకొని విడి పోతారు.. ఆ తరువాత వాళ్లు ఎలా కలిసారా లేదా అనేది మిగతా కథ...

నటన విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి..varun చాలా పరిణితి చెందిన నటనను కనబరిచాడు, అతను మరోసారి దర్శకుల హీరో అని నిరూపించాడు. ..ఎమోషనల్ సీన్స్ లో అతని నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి..ఈ సినిమాలో వరుణ్ తేజ్ అక్కడక్కడా వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్, పెదనాన్న చిరంజీవి హావభావాలు అచ్చు గుద్దినట్టు అలాగే దించేసాడు అని చెప్పాలి. వాళ్ళకి ఏ మాత్రం తీసిపోని నటనని కనబరిచి మెగా ఫామిలీ నుండి మరో సూపర్ స్టార్ వస్తున్నాడు అని చెప్పకనే చెప్పాడు. నిజానికి ఈ సినిమాకి తొలిప్రేమ అని పెట్టారు కానీ ఖుషి అనే పేరు కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పొచ్చు.. కొన్నిసార్లు ఖుషీలో పవన్ కళ్యాణ్ ని చూసినట్టే అనిపిస్తుంది.  
డాన్స్ లో వరుణ్ చాలా మెరుగు పడి మంచి ఈజ్ తో చేసాడు.ఫిదా బ్లాక్ బస్టర్ ఐన క్రెడిట్ మొత్తం సాయి పల్లవి కొట్టేయడం తో, పూర్తిస్థాయి నటుడుగ TP, వరుణ్ కి మంచి పేరు తెస్తుందని చెప్పాలి..

ఇక రాశి కాన విషయానికి వస్తే ..తనకి TP సినిమాతో ఒక మంచి రోల్ వొచింది అనే చెప్పాలి ..ఇప్పటి వరకు గ్లామర్తో అదరగొట్టిన రాశి ఊహలు గుసగుసలాడే తరువాత మళ్ళీ మొదటి సారిగా తన నటనతో ప్రేక్షకులని మాయ చేసింది. వరుణ్ తో సమానంగా స్క్రీన్ స్పేస్ ఉండడం రాశికి కలిసి వోచిన అంశం ..ఫిమేల్ లీడ్కి ఇంత పెద్ద క్యారెక్టర్ దొరకడం తెలుగు సినిమాల్లో చాల అరుదుగా జరుగుతూను ఉంటది ....ముకన్యంగా “మానుషలం !! ప్రేమ గుర్తు ఉండదు, తప్పులు MATRAME గుర్తు ఉంటాయి ” అనే డైలాగ్ డాగర తాను చూపించిన హవాన్హవాలు అందరిని ఆకట్టుకుంటాయి ..

మిగతా చార్టెర్స్ ఐన ప్రియదర్శి , హైపర్ ఆది , బుజ్జిమా ..కామెడీ జెనరేట్ చేయడంలో తమదైన పాత్రా పోషించారు ..వరుణ్ అమ్మగా సుహాసిని ఒక కీలక పాత్రలో నటించింది ..లండన్లో ఒక కుల పిచ్చి ఉన్న ఇంటి ఓనరుగా  నరేష్ చాలా బాగా చేసారు ..

సాంకేతిక విభాగానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి, మొదటి చిత్రమే ఐన, ఎక్కడ బోర్ కొట్టకుండా తీయడంలో తన ప్రతిభ చూపించాడు ..సినిమా మొత్తం కొత్తగా లేకున్నా, హీరో హీరోయిన్ కి కొత్త కారక్టరైసెషన్ ఇచ్చి , తనదిన సంభాషణలతో అలరించదువు ..మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి ..

థమన్ అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణా ...సినిమా మొత్తం   చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

జార్జ్ సి విల్లైమ్స్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది..    

మొత్తానికి , తొలి ప్రేమ చిత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక సారి చూడొచ్చు. చక్కటి ప్రేమకథకి అంతే చక్కటి జంటని కనుల విందుగా వెంకీ చూపించారు...వాలెంటైన్స్ డే కి సరికొత్త ప్రేమకథాని ఆస్వాదించొచ్చు.