విమాన ప్రమాదం 71 మంది మృతి

Posted on : 12/02/2018 10:08:00 am

మనిషి జీవితానికి గ్యారంటీ లేకుండా పోయింది. ప్రతిక్షణం ఏదో ఒక చోట ఏదో ఒక ప్రమాదం, నిత్యం ప్రమాదపు అంచుల్లో మనిషి ప్రయాణం సాగుతుంది, గాల్లో పెట్టిన దీపంలా తయారైంది. విమానం ఎక్కి గాల్లో ప్రయాణం చేద్దామనుకుంటే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నయ్. తాజాగా రష్యాకు చెందిన ఒక ప్రాంతీయ విమానం మాస్కో వెలుపల ఆదివారం ఉదయం ప్రమాదానికి గురైందని ఈ ప్రమాదం లో విమానంలోని ప్రయాణికుల్లో 71 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

మాస్కో నుండి బయలుదేరిన సాయుటోవ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 703 విమానం 65 మంది ప్రయాణికులు మరియు 6 మంది సిబ్బందితో బయలుదేరింది. టేకాఫ్ ఐన కాసేపటికే విమానం రాడార్ సిగ్నల్స్ నుండి వెలుపలికి వెళ్లిందని అధికారులు వెల్లడించారు. ఆ తరువాత విమానం ప్రమాదానికి గురైంది, ప్రమాదానికి తగు కారణాలు ఇంకా స్పష్టత లేదు, రష్యన్ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, ఆంటోనివ్ An-148 జెట్లో ఉన్న వారిలో ఎవరూ బయటపడలేరని అధికారులు తెలిపారు. అధికారులు మాస్కో వెలుపల విమాన శిధిలాలను కనుగొన్నారని, RIA నోవోస్టి వార్తా సంస్థ తెలిపింది.

రష్యాకు రవాణా మంత్రిత్వశాఖ అధికారి జున్నా ట్రెఖోవో రోసీయా -24 వార్తల ఛానల్లో మాట్లాడుతూ "మేము అన్ని రకాలుగా పరిశోదిస్తునాం ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నాం. ఇది మానవ తప్పిదం వాళ్ళ జరిగిందా లేదా వాతావరణ పరిస్థితులతో సహా ఏదైనా కారణంగా సంభవించవచ్చు." అని తెలిపారు.