హాలీవుడ్ కి మంచు మనోజ్

Posted on : 12/02/2018 10:42:00 am

మంచు ఫామిలీ అంటే విలక్షణ నటనకి కేర్ అఫ్ అడ్రస్, మంచు మోహన్ బాబు తన నటనలో ఎంత విలక్షణ చూపిస్తారో మనకు తెలిసిందే, తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని చిన్న కుమారుడు మంచు మనోజ్ కూడా విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి తనలో ఉన్న టాలెంట్ ని ఒక్కోరకంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇప్పటివరకు హీరోగా, స్టంట్ మాస్టర్ గా, సింగర్ గా, పాటల రచయితగా ఇప్పటివరకు మనం మనోజ్ ని చూసాం. కానీ ఇప్పుడు మనోజ్ కొత్తవతారం ఎత్తబోతున్నాడు తన సంగీతంతో ప్రేక్షకులని కట్టిపడేయడానికి సిద్ధం అయ్యాడు. మనోజ్ సంగీతం ఇవ్వబోతుంది తెలుగు సినిమాకి కాదు హాలీవుడ్ సినిమా 'Basmati బ్లూస్' కి తన మిత్రుడు 'అచ్చు'తో కలిసి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి 'డాన్నీ బారన్' దర్శకత్వం వహిస్తున్నాడు, మంచు లక్ష్మి ఈ చిత్రం ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చూద్దాం మనోజ్ సంగీతంతో ఎలా అలరిస్తాడో..