ధనిక ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో మన బాబు గారే!

Posted on : 13/02/2018 12:51:00 pm

గత కొన్ని సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఆస్తుల వివరాలు మీడియాకి వెల్లడిస్తున్నారు, చెప్పిన ప్రతీసారి మా ఆస్తులు పట్టుమని పాతిక కోట్లు కూడా లేదని చెప్పడం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవరికీ ఎంత ఆస్తి ఉంది అనే విషయంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ARD) జరిపిన సర్వేలో భయంకరమైన నిజాలు వెలువడ్డాయి చూద్దాం అవేంటో....

ఈ నివేదిక ప్రకారం దేశంలో ఉన్న మొత్తం 31 ముఖ్యమంత్రుల్లో మన AP ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ధనవంతులని చెప్పింది, చంద్రబాబు 177 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉన్నారు, ఆ తరువాత 129 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమ కాందు రెండవ స్థానంలో ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కి 48 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 26 లక్షలతో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ శంకర్ చివరి స్థానంలో ఉన్నారు. ఎప్పుడు మేము పేద వాళ్ళం అని గొప్పగా చెప్పుకునే నారా లోకేష్ గారు తన తండ్రే దేశంలో ధనిక ముఖ్యమంత్రి అని తెలియదేమో, కనీసం ఇప్పుడైనా ప్రజలను మభ్య పెట్టకుండా సరైన లెక్కలు చెప్పాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.