ప్రత్యేక హోదా కోసం దేనికైనా రెడీ : ఎంపిల రాజీనామా

Posted on : 13/02/2018 10:27:00 pm

పాదయాత్రలో ఉన్న వైసిపి అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు, ఈ బడ్జెట్ సమావేశాలలోపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న తమ పార్టీ ఎంపిలు రాజీనామా చేస్తారు అని అయన ప్రకటించారు. అంతే కాకుండా ప్రత్యేక హోదా కోసం దశల వారీగా చేయబోతున్న కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని దాన్ని సాదించేందుకు ఎంత దాక అయినా వెళ్తాము అని అయన బహరంగా సభలో అన్నారు. తమ కార్యాచరణలో భాగంగా మార్చి 1న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ధర్నాలు చేస్తారని అలాగే మార్చి 5వ తేదీన ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా తమ పార్టీ ఎంపిలు, ఎంఎల్యేలు ప్రజా ప్రతినిధులు, నాయకులు ధర్నా నిర్వహిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత తమ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక హోదా కోసం పార్లిమెంట్ సమావేశాలలో తమ వాణిని వినిసిపిస్తారని అయన అన్నారు. బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్‌ 6న ముగుస్తాయని సమావేశాలు పూర్తి అయ్యే లోపు కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే అదే తేదీన తమ పార్లిమెంట్ సభ్యులు రాజీనామాలు చేస్తారని ఆయన అన్నారు. చంద్ర బాబు ప్రజలను ప్రత్యేక ప్యాకేజీ మంచిది అని మభ్య పెట్టారని, ఆయన తనపై కేసులకు బయపడి ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని ప్రజలకు విన్నవించారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం దశలవారీగా పోరాటం చేస్తున్నామని, ఈ పోరాటాన్ని ప్రత్యేక హోదా సాధించే వరకు కొనసాగిస్తామని అన్నారు. విభజన హామీలు ఏమి కేంద్ర నెరవేర్చలేదు అని, చంద్ర బాబు మిత్ర పక్షంగా ఉండి ఆంధ్ర ప్రదేశ్ హక్కులను తాకట్టు పెట్టారని, రాష్ట్రం గొంతు తడిపే పోలవరాన్ని కేంద్ర పూర్తి ఖర్చులు భరిస్తా అన్న అవి రాబట్టడంలో విఫలం అవడమే కాకుండా, ప్రాజెక్ట్ వ్యయాన్ని అమాంతం పెంచేశారు అని అయన అన్నారు. విభజన చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లీమెంట్ సాక్షిగా అధికార, విపక్షాలు కలిసి హామీ ఇచ్చాయని కానీ చంద్రబాబు నైతిక విలువలు వదిలేసి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని, అసలు ఇస్తారో ఇవ్వరో, ఏమి ఇస్తారో ఏమి ఎవ్వరో తెలియని ప్రత్యేక ప్యాకేజి కోసం ఎవరైనా ప్రత్యేక హోదాని తాకట్టు పెడతారా అని చంద్ర బాబుని నిలదీశారు.