ఆంధ్ర ప్రదేశ్లో ప్రత్యేక డ్రామా

Posted on : 13/02/2018 11:16:00 pm

  ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా గురించి అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ప్రారంభించాయి. ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు నటిస్తున్నారు, కాదు కాదు జీవిస్తున్నారు. నాలుగేళ్లు నిద్రలో ఉండి ఇప్పుడే నిద్రలేచిన పార్టీలు నవంబర్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండండంతో మళ్ళి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రత్యేక హోదాని పూర్తిగా వాడుకుంటున్నాయి. వీళ్ళ నాటకాలు చూస్తుంటే ప్రత్యేక హోదా అంశం ఇవాళే తెరమీదకు వచ్చిందా అనే భావన సామాన్య ప్రజలకు కలగక మానదు. నాలుగేళ్లలో ఏనాడూ పొరపాటున కూడా పార్లమెంట్లో ప్రత్యేక హోదా గళాన్ని వినిపించని మన పార్లిమెంట్ సభ్యులు ఇప్పుడు ప్రత్యేకహోదా మాట్లాడటం చూస్తుంటే ఆంధ్ర ప్రజలు అవాక్కవుతున్నారు. ఒక్కరోజు మాట్లాడిన మాటలకే తమ సోషల్ మీడియా విభాగాల ద్వారా ఎలేవేషన్లు ఇస్తున్నారు, వాటిని షేర్ చేస్తున్న జనాలను చూస్తుంటే అయ్యో జనాలు ఎంత ఎర్రి వాళ్ళ అనిపిస్తుంది. ఈ నాలుగు సంవత్సరాలు ఎంపీలు గా అన్ని సౌకర్యాలు అనుభవించి, కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో చేదోడు వాదుడుగా ఉండి, సరిగ్గా ఇంకో 6 నెలలలో ఎలెక్షన్లు వస్తాయి అనగానే, ఆంధ్ర ప్రదేశ్ కి అన్యాయం జరిగిపోతుంది అని ముసలి కన్నీరు కారుస్తున్నారు. వీరిలో కొంతమంది సినిమా వాళ్ళు ఉండటంతో తమ వెర్రి వేషాలతో ఆంధ్ర ప్రజల పరువును దిగజారుస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి ఇచ్చిన విభజన హామీల్లో ఏ ఒక్కటి పూర్తి చేయని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు మన ఎంపీ లకు కనిపించలేదా ? అంటే ప్రజలు గొర్రెలా, మీరు ఆడే డ్రామాలు మాకు అర్ధం కదా ? అవునులే మా కులం, మా మతం, మా వర్గం అయితే చాలు మీకు ఓట్లు వేస్తాము మేము గొర్రెలం కాకా ఇంకేంటి ?
    ఒక పార్టీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉంటుంది, తమ ఎంపీ లు ప్రభుత్వంలో వుంటారు కానీ ఆంధ్ర ప్రదేశ్ కి ఏమి సాదించరు, ఇంకో పార్టీ ఏమో తమకున్న ఎంపీ లతో గట్టిగ ప్రశ్నించరు, రాజీనామా అంటారు చేయరు, ఇంకో పార్టీ మిత్ర పక్షంగా ఉంటుంది కానీ ప్రభుత్వంలో జరిగే విషయాలతో ఈ పసిగొడ్డుకి సంబంధం ఉండదు. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం తప్పించి వీళ్ళ వల్ల ప్రజలు ఎటువంటి ఉపయోగం లేదు.
    ఆలస్యంగా తేరుకున్నారు అనుకుందాం, కానీ అక్కడ కూడా తమకు పేరు రావాలి అని కొట్టు కోవడం తప్పితే ఎక్కడా ఆంధ్ర ప్రదేశ్ కి జరిగిన అన్యాయం గురించి కూసంతయినా వారిలో బాధ, కోపం కనిపించవు. టీడీపీ ఎంపీ లు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేప్పుడు జగన్ కేసుల గురించి ఎందుకు ? వైసీపీ ఎంపీ లకు చంద్ర బాబు తో పనేంటి, అయన నోటికి ఓటు కేసు తో సంబంధం ఏంటి ? అంటే వాళ్ళ ఉద్దేశం రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని కాదు, తమకి పేరు రావాలి అని, ఇందుకోసం వ్యక్తిగత దూషణలతో ఒకరిని ఒకరు తిట్టుకొని కేంద్ర దగ్గర చులకన అవడం కంటే ఏమి వుంది ? పట్టు మని పాతిక మంది ఎంపీ లు లేరు, ఒక విషయం మీద పోరాడుతున్నపుడు పార్టీని పక్కన పెట్టి పోరాడచ్చు కదా, అలా చేయరు, ఎందుకంటే తమ పార్టీకి, తమకి పేరు రాదు కదా.
   మన ఎంపీ లలో చాల మంది పారిశ్రామిక వేత్తలు, వారి అవసరాలకు అనుగుణంగా వారి పోరాటం ఉంటుంది తప్పితే వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. నాలుగేళ్లు నిద్ర పోయి ఒక్కరోజు పోరాడితే హోదా రాదు, పార్టీని విడిచి పెట్టి అందరు సమిష్టిగా పోరాడితే ఏదయినా లాభం ఉండచ్చు. టీడీపీ ప్రభుత్వం నుంచి బయటకి రావాలి, వైసీపీ, టీడీపీ ఎంపీ లు రాజీనామాలు చేసి ఢిల్లీలో పోరాడితే అప్పుడు తెలుస్తుంది, అంతే కానీ ఒకరి మీద ఒకరు బురద జల్లు కుంటే కేంద్ర చూసి నవ్వుకుంటుంది తప్పితే ప్రత్యేక హోదా కాదు కదా, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వదు.