అ! సినిమా సమీక్ష

Posted on : 16/02/2018 11:55:00 pm

చిత్రం : అ!

నటీనటులు: కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా కసాండ్రా, ఈషా రెబ్బా,అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు
సంగీతం: మార్క్.ఎ.రాబిన్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన - దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

గమనిక: మీరు 'అ!' చూడనట్లయితే దయచేసి మా రివ్యూ చదవకండి.

ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న చిత్రాలలో ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది 'అ!' చిత్రం. కాజల్, నిత్యా మీనన్, రెజినా, ఈషా, శ్రీనివాస్ అవసరాల మరియు ప్రియదర్శి లాంటి తారాగణం, నాని మొదటిసారి నిర్మాతగా మారి, కేవలం ఈ చిత్రం కోసమే తాను నిర్మాతగా మారానని చాలాసార్లు చెప్పడం వల్లనూ అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీలో కూడా ఈ చిత్రం మీద అంచనాలు భారీగా పెరగడానికి ముఖ్య కారణాలుగా చెప్పొచ్చు. చూద్దాం ఈ చిత్రం అంచనాలను అందుకుందో లేదో...  

టీజర్ లో నాని చేపినట్టే కథ హీరోగా నడిచే ఈ చిత్రంలో ఒక 7 కధలు మనకు కనిపిస్తాయి, ఆ 7 కథలను ఎలా అనుసంధానం చేసాడు, కథను దర్శకుడు నడిపిన తీరు ఈ చిత్రంలో మెచ్చుకోదగిన అంశాలు ..ఇదే ఫార్మాట్లో వచ్చిన 'చందమామ కథలు' మరియు 'వేదం' సినిమాలకి 'అ!' సినిమాకి ఎలాంటి పోలిక ఉండదు అని ఫస్ట్ హాఫ్ లో నే మనకి అర్ధం ఐతుంది .. అంతెందుకు మీరు టైటిల్స్ పడేటప్పుడు తీక్షణంగా చూస్తే కథేంటో మీకు అర్ధం అవుతుంది. 'అ!' లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో కథ గురించి డిస్కస్ చేస్తే మనం క్రైమ్ చేసినట్టే.. కాబట్టి అలాంటి క్రైం చేయకుండా. అంటే కథేంటో చెప్పను కానీ ఆ కథ ఎలా తీశారో, మొత్తంగా 'అ!' ఎలా ఉందొ చూద్దాం...
 
ఇందులో ఉన్న ప్రతి కారెక్టర్కి ఒక కథ ఉంటుంది అలాగే అందరి కథలు ఏదో ఒక చోట కలుసుకోవటం అనేది మనం అన్ని సినిమాల్లో చూస్తుంటే ఉంటాం, 'అ!' కూడా అందుకు మినహాయింపేమి కాదు, కాకపోతే కదా నడిపిన తీరు పాత్రల తీరు తెన్నులు ఒకింత విచిత్రంగా ఉంటాయి అంతే, విచిత్రం అనటం కంటే మీరు ఇంతకుముందు ఎలాటి పాత్రలు చూడలేదు అని చెప్పొచ్చు. ఇందులో ప్రతి ఆర్టిస్ట్ తన పాత్ర మేరకు చాల అద్భుతంగా నటించారు. నాని చేపగా , రవి తేజ చెట్టుగా అందించిన వాయిస్ ఓవర్ థ్రిల్లింగ్గా సాగే కధలో ఓకింత హాయ్గా నవ్వుకునేలా ఉంటాయీ. .ముఖ్యంగా చెట్ల విలువ గురించి రవి తేజ చెప్పిన డైలాగ్స్ ప్రతి ఒకరిని కడుపుబ్బా నవ్విస్తాయి , అంతర్లీనంగా ప్రేక్షకులకి ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తాయి ..

'డైలాగ్ ఇన్ ది డార్క్' అనే డిఫ్రెంట్ షార్ట్ ఫిలింతో ఎంతో సృజనాత్మకత ఉన్న దర్శకుడిగా పేరును తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని ఒక కొత్త కోణంలో చూపించాడు . .తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి మల్టీ జానర్ ఫిలిం రాలేదు అనే చెప్పాలి. .కొత్తగా కథ చెపుతూనే, ప్రతి క్యారెక్టర్ ద్వారా సామాజిక సందేశం ఇచ్చాడు .. .నిత్యా మీనన్, ఈషా రెబ్బ కేరక్టర్స్ ద్వారా స్త్రీలను లైంగిక వేధింపులకు ఎలా గురవుతారు, చిన్న పిల్లలుగా ఉన్నపుడే వాళ్ళ ఆలోచనలు ఎలా చేంజ్ అవుతాయి..మురళి శర్మ క్యారెక్టర్ ద్వారా దేవుడు కంటే గొప్ప వాడు ఎవడు లేడు అని ....ఇలా ప్రతి క్యారెక్టర్ ద్వారా ఏదో ఒక మెసేజ్ అంతర్లీనంగా ఇచ్చాడు.

కార్తిక ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. .రాబిన్ ఆంధిచిన థీమ్ సాంగ్ అండ్ BGM సినిమాని ఒకమెట్టు పైకి ఎక్కించింది అనే చెప్పాలి. ఇలాంటి కొత్త కధని ప్రొడ్యూస్ చేసిన నానిని అభినందించకుండా ఉండలేం .ఇలాంటి కమర్షియల్ అంశాలు లేని ఈ చిత్రం మాస్ కధల్ని ఇష్టపడే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ కొత్త కథలు చూసేవాళ్ళకి, కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఈ చిత్రం ఒక మంచి అనుభూతుని మిగిలిస్తుంది ..
 
ఫైనల్లీ , 'అ!' చిత్రం గురించి ఎలాంటి  విషయాలు తెలుసుకోకుండా వెళ్ళండి, మీకు సినిమా అద్భుతంగా అనిపిస్తుంది. పోస్టర్లో చెప్పినట్టే...
        'అన్ని సినిమాల్లో కెల్లా 'అ!' సినిమా వేరయ్య'
         'విశ్వధాబి రామ! ఈ సినిమా కొత్తగా ఉంది రా మామ'!!

-సత్తార్ విప్లవ్ రెడ్డి