ఇంకా విడుద‌ల‌కు నోచుకోని ‘2.ఓ’ కారణం ?

Posted on : 17/02/2018 12:11:00 pm

‘2.ఓ’ వీఎఫ్‌ఎక్స్‌ పనులకు అమెరికాకు చెందిన ఓ సంస్థకు అప్పగించింది చిత్ర బృందం. అయితే తాజా తెలిసిన విషయం ఏంటంటే? ఆ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించుకుంది. దీంతో 3డీ ఎఫెక్ట్స్‌తో సహా మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ పనులు మళ్లీ మొదలు పెట్టాల్సి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చేసిన వీఎఫ్‌ఎక్స్‌ పనులపై కూడా చిత్ర బృందం సంతృప్తిగా లేదట. సినిమా ఉన్నతంగా ఉండాలని అందులో ఎలాంటి రాజీ పడకూడదని భావిస్తున్నారట. దీంతో వీఎఫ్‌ఎక్స్‌ పనులను కొత్త బృందానికి అప్పగించే అవకాశ ఉందని చిత్ర వర్గాల సమాచారం.ఆ కసరత్తు పూర్తయితే టీజర్‌, ట్రైలర్‌ తేదీలతో పాటు సినిమా విడుదల తేదీని కూడా వెల్లడిస్తారని అంటున్నారు.

అమీజాక్సన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్‌ ‘ఖిలాడీ’ అక్షయ్‌కుమార్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పాటల విడుదల వేడుకను దుబాయ్‌లో అట్టహాసంగా చేసిన సంగతి తెలిసిందే.