మీరెవ‌రితో .... ర‌జ‌నీతోనా.... కమల్‌తోనా....

Posted on : 17/02/2018 01:37:00 pm

 యువ కథానాయకుడు కార్తి నటించిన ప్రతీ చిత్రం తెలుగులోనూ విడుదలవుతుంటుంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండ‌డంతో ఇక్కడి కథానాయకులకు సమానంగా ఆయన సినిమాలను విడుదల చేస్తారు నిర్మాతలు. గతేడాది ‘ఖాకీ’ వంటి విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘కడియకుట్టి సింగం’. ఈ సందర్భంగా కార్తి విలేకరులతో త‌మిళ రాజకీయాల గురించి మాట్లాడారు.
ప్రస్తుతం మీరు రజనీకాంత్‌కు మద్దతు ఇస్తారా? లేక కమల్‌హాసన్‌కు మద్దతు ఇస్తారా? అన్న ప్రశ్నకు.. ‘ఇంకా కొన్ని నెలలు వేచి చూడాల్సిన సమయం ఉంది. తమిళ ప్రజలకు వారు ఏం చేయాలనుకుంటున్నారో చూద్దాం. ఇద్దరూ లెజెండ్స్‌. తమిళ ప్రజలకు ఏదో చేయాలని మాత్రమే నిజాయతీతో వస్తున్నారు. ముందు వారి ప్రణాళికలు ఏంటో ముందు చూద్దాం!’’ అని అన్నారు.