సినిమా స‌క్సెస్‌తో గిఫ్ట్‌ కారులో ‘ఛలో’ అంటున్న చిత్ర ద‌ర్శ‌కుడు

Posted on : 17/02/2018 01:46:00 pm

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛలో’ ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక కథానాయిక. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు. దర్శకుడిపై నమ్మకంతో ఐరా క్రియేషన్స్‌ను స్థాపించి సినిమాను నిర్మించారు నాగశౌర్య. సినిమా మంచి టాక్‌ను తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లతో కళకళలాడుతుండటంతో యూనిట్‌ సభ్యులకు ప్రత్యేక బహుమతులు ఇస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు నిర్మాతలు. చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకు హ్యుందాయ్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు నిర్మాతలు.
రెండు వారాల్లో ‘ఛలో’ రూ.23కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రీమేక్‌, శాటిలైట్‌ హక్కుల రూపంలో మరో రూ.6కోట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో చిత్ర విజయానికి కారణమైన వారందరికీ ప్రత్యేక బహుమతులు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీలోనూ మంచి వసూళ్లతో ‘ఛలో’ అంటూ వెళ్తొంది.