సీసీఎస్ ఎదుట హాజ‌రైన రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Posted on : 17/02/2018 01:49:00 pm

ఎన్నో వివాదాలు మ‌రెన్నో సంచ‌నాల‌కు కేంద్ర బిందువైన కాంట్ర‌వ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ పోలీస్‌స్టేష‌న్ గ‌డ‌ప తొక్కారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచార‌న్న మ‌హిళా సంఘాల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన పోలీసులు వ‌ర్మ‌ను ఎట్ట‌కేల‌కు పిఎస్‌కు ర‌ప్పించారు. ఆయ‌న కాసేప‌టిముందు సీసీఎస్ పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఆర్‌జివికి ప్ర‌శ్న‌లును సంధిస్తోంది సీసీఎస్‌ స్పెష‌ల్ టీమ్‌. విచార‌ణ‌కు హాజ‌ర‌యిన వ‌ర్మ‌ను సీసీఎస్ స్పెష‌ల్ టీమ్ ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతుంది.