బిగ్‌బాస్ 2 లో తారక్ డ‌వుట్ ?

Posted on : 17/02/2018 01:55:00 pm

 జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెలుగులో వచ్చిన బిగ్‌బాస్‌ షో బుల్లితెరపై తిరుగులేని టీఆర్పీ రేటింగ్‌తో రికార్డులు సృష్టించింది. తారక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో సూపర్‌ హిట్‌ అయింది. బిగ్‌బాస్‌2 గురించి అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు బిగ్‌బాస్‌ షో తర్వాతి సీజన్‌పై టాలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌ అయింది.

ప్రస్తుతం తారక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉండ‌డంతో తారక్‌ను మళ్లీ బిగ్‌బాస్‌ షోలో చూసే అవకాశం లేదనే వార్త టాలీవుడ్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఒకటి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తుండగా రెండోది దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం. త్రివిక్రమ్‌తో సినిమా మార్చి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమౌతుంది. దాని తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌లో చేయాలి. ఈ రెండు సినిమాల కారణంగా బిగ్‌బాస్ రెండో సీజన్‌ చేయడానికి తగిన ఖాళీదని అందుకే ఎన్టీఆర్‌ బిగ్‌బాస్ నుంచి తప్పుకున్నారనే వార్త తెగ హల్‌చల్‌ చేస్తోంది.

అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అలా అని ఎవరూ ఖండించలేదు. దీంతో తారక్‌ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఏది ఏమైనా ఈ వార్తలో నిజం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.