మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్ టిఎన్‌శేషన్‌తో కమల్‌

Posted on : 17/02/2018 04:03:00 pm

కమల్‌హాసన్ రాజ‌కీయ వ్యూహంలో భాగంగా ఆయన మరో అడుగు ముందుకు వేశారు. మాజీ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి టీఎన్‌ శేషన్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలిసి సుమారు 15 నిమిషాల పాటు కమల్‌ మాట్లాడారు. ఎలక్షన్‌ కమిషన్‌లో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తిగా టీఎన్‌ శేషన్‌కు గుర్తింపు ఉంది. శేషన్‌ ఎన్నికల అనుభవాల గురించి తెలుసుకునేందుకు కూడా వెళ్లినట్లు కమల్‌ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ గురించి ఏవైనా అనుమానాలు ఉంటే, వాటిని నివృత్తి చేసుకునేందుకు మళ్లీ విజిట్‌ చేస్తానని శేషన్‌కు తెలియజేసినట్లు కమల్‌ చెప్పారు. ఈనెల 21వ తేదీన కమల్‌ తన రాజకీయ పార్టీ గురించి కీలక ప్రకటన చేయనున్నారు.