ఒక్క క్షణం మూవీ రివ్యూ

Posted on : 30/12/2017 04:34:00 pm

అల్లు సినీ వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అల్లు శిరీష్ రాశి కంటే వాసినే నమ్ముకున్నట్టు కనిపిస్తున్నాడు. వరుస సినిమాల కంటే విభిన్నమైన చిత్రాలను ఎంచుకొంటూ ప్రేక్షకులకు చేరువవుతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫీల్‌గుడ్ మూవీ తర్వాత ఒక్క క్షణం చిత్రంతో డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రంలో సీరత్ కపూర్, వీఐ ఆనంద్, సురభి, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా సైంటిఫిక్, సస్సెన్స్ థ్రిల్లర్‌తో వచ్చిన అల్లు శిరీష్ ఎలాంటి ఫలితాన్ని అందుకొన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

జీవా (అల్లు శిరీష్), జో (సురభి) లవర్స్. జో ఫ్లాట్‌కు ఎదురుగా ఉంటే ఫ్లాట్‌లో శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) దంపతులు ఉంటారు. అయితే శ్రీనివాస్, స్వాతి దంపతుల మధ్య ఎప్పుడు గొడవ పడుతుంటారు. వారిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారనే విషయాన్ని జీవా తెలుసుకోవడానికి ప్రయత్నించగా వారి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలే తమ జీవితంలో కూడా జరుగుతున్నాయని తెలుసుకొంటారు. ఈ నేపథ్యంలో స్వాతి దారుణ హత్యకు గురవుతుంది. స్వాతి హత్యా నేరం శ్రీనివాస్‌పై మోపబడి అతను జైలుకెళ్తాడు. ఈ నేపథ్యంలో తమ జీవితంలో కూడా ఇలానే జరుగుతుందా అని జీవా, జో భయంతో వణికిపోతారు.s
ఇంతకీ స్వాతిని శ్రీనివాస్ చంపాడా? లేదా స్వాతి ఎలా దారుణ హత్యకు గురైంది? జీవా, జో జీవితంలో కూడా ఇలాంటి సంఘనలే జరిగాయా? జో కూడా హత్యకు గురవుతుందా? లేదా స్వాతి, శ్రీనివాస్ లైఫ్‌లో జరిగిన సంఘటనుల తమ జీవితంలో చోటుచేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారు అనే తెర మీద ప్రశ్నలకు సమాధానమే ఒక్క క్షణం సినిమా.