"దశాబ్ధాల రాజ్యాధికారం.. ప్రజల్లో అసహనం.... "దశాబ్ధాల రాజ్యాధికారం.. ప్రజల్లో అసహనం....

సిరియా మారణ కాండ Full Story - Part I

Posted on : 10/03/2018 06:07:00 pm

"దశాబ్ధాల రాజ్యాధికారం.. ప్రజల్లో అసహనం....

తిరుగుబాటుతో మొదలైన పోరాటం..తిరుగుబాటు అణిచివేతకు విఫల యత్నం..

 పోరాటం లోకి చొరబడిన ఉగ్రవాదం..పరస్పర దాడులతో మొదలైన యుద్ధం... స్మశానమైన  దేశం... శవాలుగా మారుతున్న ప్రజానికం

                                                                                                                                    క్లుప్తంగా వివరించాలంటే ఇదే సిరియా కధ..!"

ఈ కధ నిన్న మొన్న మొదలైంది కాదు... ప్రస్తుత సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సోదరుడైన బసిల్ అల్ అసద్ మరణం తో ఈ రావణ కాష్టానికి బీజం పడింది..1970 నుండి 2000 వరకు సిరియా దేశాన్ని పాలించిన హఫీజ్ అల్ హసద్ తన వారసుడిగా తన పెద్ద కొడుకైన బసిల్ ని ఎంచుకుని అతన్ని మొదటి నుండి రాజకీయాల్లో రాణించడానికి అన్ని విధాలా సన్నధ్ధం చేయసాగాడు.రెండవవాడైన బషర్ ని రాజకీయాలకి దూరం గా పెంచాడు..బషర్ కి కూడా అధికారం చేపట్టాలన్న కోరిక ఎప్పుడూ లేదు.. అన్న రాజకీయాల్లో రాణిస్తుంటే తమ్ముడు ఉన్నత చదువుల పై దృష్టి పెట్టాడు.. బషర్ కి వైధ్య విద్య మీద ప్రేమతో దమస్కస్ విశ్వవిద్యాలయం లో తన చదువుని పూర్తి చేసాడు..దమస్కస్ లో తన చదువు పూర్తైన తరువాత అతను 1992 లో ఇంగ్లాండ్ కి వెళ్ళి తన వైద్య విద్యని కొనసాగించాడు. ఈ సమయం లో అతను పాశ్చ్యాత్య సంస్కృతికి ఆకర్షితుడయ్యాడు.. అదే సమయం లో తన తండ్రి హఫీజ్ తన అన్న బసిల్ ను ఒక సమర్దవంతుడైన నాయకుడిగా తీర్చిదిద్దాడు..ప్రజల్లో బసిల్ కి మంచి ఆదరణ ఉంది... తండ్రికి తగ్గ తనయుడు అన్న పేరు ఉంది.. ప్రజాకర్షణ ఉంది.. రాజకీయ చాణక్యం ఉంది...సిరియా వీదుల్లో ఏ గోడ మీద చూసిన బసిల్ ఫోటో నే ఉండేది... అతను ప్రజల్లో బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు..కాని ఆ దేశ ప్రజలు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది.. హఫీజ్ తన పెద్ద కొడుకు బసిల్ కు రాజ్యాధికారాన్ని అప్పగించాలనుకుంటున్న సమయం లో దురదృష్టవసాత్తు బసిల్ కారు ప్రమాదానికి గురై మృతి చెందాడు..అతని మరణం హఫీజ్ కు ఆ దేశ ప్రజలకు తీవ్ర దిగ్బ్రాంతి ని కలిగించింది..ఈ ఊహించని పరిణామం తో ఇంగ్లాండ్ లో ఉన్న బషర్ కి స్వదేశానికి తిరిగి రావాలని పిలుపు వచ్చింది..ఇక్కడ హఫీజ్ ఒక చారిత్రాత్మక తప్పిదం చేశాడు..బసిల్ మరణం తో ఖాళీ అయిన తన వారసత్వపు స్థానాన్ని బసిల్ అడుగు జాడల్లో నడుస్తున్న చిన్న కొడుకైన మహిర్ ను కాదని దేశ రాజకీయాల మీద ఆశక్తి లేని  బషర్ తో భర్తీ చేయాలని తలచాడు...ఇక్కడే ప్రస్థుత మారణ హోమానికి బీజం పడింది.

అప్పటి వరకు విలాసవంతమైన జీవితం గడిపి వచ్చిన బషర్ కి పాశ్చ్యాత్య సంస్కృతి బాగా ఒంటబట్టింది. బయటి ప్రపంచం తో పోల్చితే తన దేశం వెనకబడి ఉందన్న భావన బషర్ మనసులో బలం గా ఉంది..హఫీజ్ బషర్ ను తన వారసుడిగా ప్రచారం చేసేందుకు తీవ్రం గా ప్రయత్నించాడు..రాత్రికి రాత్రి సిరియా వీదుల్లో బసిల్ స్థానం లో బషర్ ఫొటోలు గోడలపై ప్రత్యక్షమయ్యాయి..హఫిజ్ తన ఆరోగ్యం సహకరించకున్నా తన కొడుకుని తీర్చిదిద్దడానికి చాలా కష్టపడ్డాడు..దాదాపు రెండు సంవత్సరాలు బషర్ కి రాజకీయాల్లో సైనిక వ్యవహారాల్లో తర్ఫీదునిచ్చాడు..ఈ రెండేళ్ళ కాలం లో బషర్ కూడా బాగానే రాటు తేలాడు.. చాలా మారాడు..బలమైన రాజకీయ నాయకుడిగా తయారయ్యాడు..కాని సిరియా ప్రజలు మాత్రం అతని మార్పుని గుర్తించలేదు.. అతను బసిల్ కి సరిసమానమైన వ్యక్తి కాదని ప్రజల్లో బలంగా నమ్మకం మిగిలిపోయింది.ఇక సమయం దగ్గర పడుతుండడంతో అప్పటికి అంతగా మిలిటరీ వ్యవహారాల పైన అవగాహన లేని అతనికి 1998 లో లెబనన్ లోని సిరియా మిలిటరీ  అధికారాలని అప్పచెప్పాడు..ఇంకొక రెండు సంవత్సరాలకి 2000 వ సంవత్సరం లో హఫిజ్ మృతి చెందాడు.. ఖాళీ అయిన దేశాధ్యక్షుడి స్థానం లోకి 10 జులై 2000 వ సంవత్సరం లో సిరియా దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు..     మిగతా కథ రెండవ భాగంలో..!

   -బ్రహ్మా బత్తులూరి