పాశ్చ్యాత్య భావజాలాలున్న బషర్ అధ్యక్షుడిగా తన మొ" />  పాశ్చ్యాత్య భావజాలాలున్న బషర్ అధ్యక్షుడిగా తన మొ" />

సిరియా మారణ కాండ Full Story - Part II

Posted on : 10/03/2018 04:05:00 am

 పాశ్చ్యాత్య భావజాలాలున్న బషర్ అధ్యక్షుడిగా తన మొదటి ప్రసంగం లోనే సిరియా వెనకబడి ఉందని తన పాలనలో సిరియాని ఆధునీకరిస్తానని తన మనసులోని భావాలని వెలిబుచ్చాడు. 29 ఏళ్ళ తండ్రి పాలన తరువాత ఒక కొత్త నాయకుడు మార్పుని తీసుకొస్తానంటే ప్రజల్లో ఆశ మొదలైంది..తన మొదటి ప్రసంగం లోనే ప్రజాస్వామ్యం పారదర్శకత, నిర్మాణాత్మక విమర్శల్నిస్వాగతించడం వంటి మాటలకి ప్రజలు ఆకర్షితులయ్యారు..బషర్ అన్నట్లుగానే సంస్కరణలు మొదలు పెట్టాడు.. ప్రతిపక్షాలకి విలువనివ్వడం, పత్రికా రంగానికి కొంచెం స్వేచ్చనివ్వడం మేధావులకి సంస్కరణల గురించి సూచించే అవకాశం ఇవ్వడం లాంటి చర్యల వల్ల ప్రజల్లో కూడా హర్షాతిరేకాలు మొదలయ్యాయి..బషర్ రాజకీయ సంస్కరణలతో పాటు  ఆర్ధిక సంస్కరణల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు.కొన్ని సార్లు తన తండ్రి హయాంలో జరిన తప్పులని కూడా ఎత్తిచూపేవాడు.. ప్రివేటీకరణ వైపు అడుగులేసాడు.. బ్యాంకులని ప్రైవేటీకరించాడు, ఇంటెర్నెట్ ని అందుబాటులోకి తీసుకొచాడు, విదేశీ పెట్టుబడులని ఆహ్వానించాడు..కానీ అతని సంస్కరణలల్లో నిస్వార్దం కొరవడింది.. అతని సంస్కరణలన్నీ సామాన్య ప్రజానీకానికన్నా అతని బంధువులకి అతని కుటుంబానికి లాభం చేకూర్చాయి.. ప్రజలకి అభివృధి ఫలాలు అందలేదు.బషర్ చర్యలు తన తండ్రి హయాం నుండి పదవుల్లో ఉన్న కొంతమంది పాతకాలపు అధికరులకి మంత్రివర్గానికి నచ్చలేదు మితిమీరిన పారదర్శకత వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు లేచే అవకాశం ఉందని వాళ్ళు వారిస్తూనే ఉన్నారు..తన సంస్కరణలు, పారదర్శక పాలన ఎక్కువ కాలం సాగించలేకపోయాడు.. అతి తక్కువ కాలం లోనే కొంతమంది ప్రజలు మరియూ వ్యతిరేక వర్గాల నుండి పరిపాలన మార్పు కావలన్న కోరిక బలం గా వినబడసాగింది.. బషర్ వ్యతిరేక వర్గాలు అతని ప్రభుత్వం లోని అవినీతి పై ఆరోపణలు చేయసాగారుకొన్నాళ్ళు సమ్యమనం పాటించిన బషర్ వ్యతిరేక వర్గాలపై ఎదురుదాడి చేయడం మొదలు పెట్టాడు..ప్రభుత్వ వ్యతిరేకులందరిని దేశద్రోహుల కింద చిత్రీకరించే ప్రయత్నం చేసాడు.. కొందరు ప్రతిపక్ష నాయకులని కారాగారాల పాల్జేసాడు..ఇలాంటి పరిస్థితుల మధ్య మార్చ్ 2011 లో కొందరు యువకులు ఒక స్కూల్ గోడ మీద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు విప్లవాత్మక నినాదాలని అచ్చు వేసారు. ఆ విషయం తెలుసుకున్న అక్కడి సైనిక సిబ్బంది ఆ కుర్రోళ్ళని అదుపులోకి తీసుకుని కౄరంగా హింసించారు..ఆ చర్యతో దేశం మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఆందోళనలు చేపట్టారు.. రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూ గొడవలకి దిగారు..ఆ ఆందోళనలని అదుపు చేయడానికి సైన్యం ఉద్యమకారులపై కాల్పులకి తెగబడ్డారు.. కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు పోయాయి.. ఆందోళనలు దేశం మొత్తం వ్యాపించాయి.. ప్రజలు రోడ్లపైకి వచ్చి బషర్ రాజీనామా చేయాలని ఆందోళన చేశారు..ఆందోళనలని అణిచివేయడానికి ప్రభుత్వం చేసిన ప్రతి ప్రయత్నం అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇంకా రెచ్చ గొట్టే చర్యలుగా మారి ఆందోళనలని తీవ్రతరం చేసాయి..ప్రతిపక్షాల సానుభూతిపరులు సాయుధ దళాలుగా ఏర్పడి సైనిక సిబ్బందిపై దాడులు చేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టడం మొదలుపెట్టారు..చిన్న చిన్న ఆందోళనలు కాస్తా చిలికి చిలికి గాలి వాన అయినట్లు దేశం లో అంతర్యుద్ధానికి దారి తీసాయి.. సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది..                     మిగతా కధ మూడవ భాగం లో...!