హైదరాబాద్ పాతబస్తీలో ఏం జరిగినా సంచలనమే, అక్కడ చీమ చిటుక్కుమన్నా దేశ వ్యాప్తంగా సంచలనమవుతుంది. " /> హైదరాబాద్ పాతబస్తీలో ఏం జరిగినా సంచలనమే, అక్కడ చీమ చిటుక్కుమన్నా దేశ వ్యాప్తంగా సంచలనమవుతుంది. " />

పాతబస్తీ దోపిడీ వెనుక అసలు దొంగలెవరు?

Posted on : 07/03/2018 09:05:00 am

హైదరాబాద్ పాతబస్తీలో ఏం జరిగినా సంచలనమే, అక్కడ చీమ చిటుక్కుమన్నా దేశ వ్యాప్తంగా సంచలనమవుతుంది. ఎందుకంటే? పాత బస్తీలో పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు అక్కడ జరిగిన మరో అశం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. నిత్యం రద్ధీగా ఉండే ప్రాంతంలో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించిన వార్త దావానంలా పాకింది. ఏకంగా బంగారు కార్ఖానానే కొల్లగొట్టి ఐదు కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన హైదారాబాద్ పోలీసులకు పెనుసవాల్ గా మారింది. కాగా ఘటనపై అనేక అనుమాలు రేకెత్తుతున్నాయి. అసలు ఇది దోపీడీ దొంగల పనేనా లేక ఇంటిదొంగల ప్రమేయం ఇందులో ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎటు చూసినా జనసంచారం ఉండే ప్రాంతంలో దోపిడీకి పాల్పడటమంటే ప్రాణాలకు తెగించినట్లే అంత ధైర్యంగా దోపిడీకి పాల్పడటమంటే దీని వెనుక పక్కా ప్లానింగ్ ఉండే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సినీ ఫక్కీలో పాతబస్తీలో కత్తులు తుపాకులతో బెదిరించి ఐదు కిలోల బంగారం ఎత్తుకెళ్లింది దోపిడీ దొంగల పనా, లేక మరో పథకం ప్రకారం జరిగిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.

ఇంత భారీ దోపిడీ జరిగిన సమయంలో మొత్తం 20 మంది కార్మికులు, యజమాని కుమారుడు సాహెబ్‌ దాస్‌ ఉన్నారు. ఆ సమయంలో 12 మంది లోపలికి ప్రవేశిస్తుంటే చూసిన వారు ఎందుకు పట్టించుకోలేదు. రెండంచెల డోర్‌ ఉన్న ఆ కార్ఖానాలోకి ఏకకాలంలో 12 మంది ఎలా ప్రవేశించారు. లోపల సుమారు గంటసేపు దోపిడీదారులు హల్‌చల్‌ సృష్టిస్తున్నా.. ఈ విషయం బయటకు ఎందుకు రాలేదు. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫుటేజ్‌ ఎక్కడ స్టోర్‌ అవుతోంది. డీవీఆర్‌ను సైతం తస్కరించిన దుండగులు గంట సమయంలో దోపిడీతో పాటు ఇవన్నీ ఎలా చేయగలిగారనే విషయాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దోపిడీ చేసిన తర్వాత వారు బయటకు వెళ్తున్న సమయంలో కూడా ఎలాంటి అరుపులు, కేకలు పెట్టకపోవడంపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పని చేస్తున్న వారి సహకారంతోనే దోపిడీ దొంగలు అక్కడికి చేరుకున్నా రా? లేక మరెవరైనా వారిని సహకరించారా? అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. 

ఈ ఘటనకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి.
ముంబైకి చెందిన వ్యాపారి నిథాయిదాస్‌, అతని కుమారుడు సాహెబ్‌దాస్‌లు ఆరేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తున్నారు. దోపిడీ చేసిన వారు కూడా హిందీలో మాట్లాడారని పోలీసులకు పనివారు చెప్పిన ఆధారాల మేరకు ఇది ముంబై ముఠా పనేనని పోలీసులు తొలుత నిర్ధారించుకున్నా రు. వ్యాపారికి తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావించారు. కానీ, గంటకు పైగా సాగిన ఈ దోపిడీ ఘటనలో పనివారు ఎలాంటి అరుపులు.. కేకలు వేయడం పోలీసులను విస్మయానికి గురి చేస్తోంది. ఓ ప్లాన్‌ ప్రకారమే జరిగిందని భావించిన పోలీసులు ఇక కేసు విచారణను కూడా ఓ ఛాలెంజ్‌గా తీసుకుని రంగంలోకి దిగారు. పనివారు ఇచ్చిన వివరాలతో పోలీసులు నిందితుల వద్దకు చేరుకుని ఉంటారని భావిస్తున్నారు.

ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడి నుంచే పోలీసులు విచారణను ప్రారంభించారు. ముందు జాగ్రత్త చర్యగా పరిసరాలను కలిపే ఎనిమిది కూడళ్లలో వాహనాల చెకింగ్‌ ఏర్పాటు చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో చార్మినార్‌, హుస్సేనీఆలం, మొగల్‌పురా, మీర్‌చౌక్‌ పోలీ్‌సస్టేషన్ల సిబ్బందితో పాటు దక్షిణ మండలం పోలీసులు అలర్ట్‌ అయ్యారు. నిందితులను పట్టుకోడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పని చేస్తున్న 20 మందితో పా టు ఓనర్‌ను కూడా ఎవరితో మాట్లాడవద్దన్న పోలీసులు ముందు వారి నుంచే విచారణ ప్రారంభించారు. వారిని అదుపులోకి తీసుకుని సమగ్ర వివరాలు తెలుసుకున్నారు.

ఆరేళ్ల నుంచి ఇక్కడ ఆభరణాల తయారీ సాగిస్తున్న ఈ వ్యాపారి వద్ద ఇప్పటి వరకు 100కుపైగా మంది పని చేశారని.. చాలా మంది పని మానేసిన వారు కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇక్కడ పని చేసి మానేసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా లేక ఇక్కడ పని చేస్తున్న వారి సహకారం తో కొత్తవారెవరైనా ప్రవేశించారా? అనే కో ణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఇంతకు ముందు పని చేసిన వారు ఉండటంతోనే బయటి వారు పట్టించుకోలేదా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. గతంలో పని చేసిన వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. యజమాని పాత్రపై కూడా దృష్టి సా రిస్తున్నామని డీసీపీ చెప్పారు.

మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ఈ ఘటన జరిగినప్పుడు అదే సమయంలో మరో కేసు నిమిత్తం కమిషనర్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాట్లలో డీసీపీ బిజీగా ఉన్నారు. దోపిడీ సమాచారం అందగానే చార్మినార్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ చైతన్యకుమార్‌తో పాటు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి. కమిషనర్‌ కార్యాలయం నుంచి డీసీపీ సత్యనారాయణ కూడా అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించి నిందితుల గురించి ఓ స్పష్టత వచ్చిందని, 24 గంటల్లో కేసును చేదిస్తామని డీసీపీ వివరించారు.