నారాయణ కాలేజ్ సీజ్ ..

Posted on : 07/03/2018 11:20:00 am

వడ్డించేవాళ్లు మనోళ్లైతే ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న సామెత తెలంగాణ లో వర్తించలేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నది ఏపీ మంత్రి నారాయణ అయితే వడ్డించేది తెలంగాణ అధికారులు అందుకే ఆ సామెత వర్కవుట్ కాలేదు. ఏపీ ప్రభుత్వంలో పేరు, పలుకుబడి పుష్కలంగా ఉన్న మంత్రికి ఆయన పేరుమీద లెక్క లేనన్ని విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయనకు విద్యాసంస్థల ద్వారా వచ్చే ఆదాయం కూడా అంతా ఇంతా కాదు అదేం కక్కుర్తో గాని ఆయన నిర్విహిస్తున్న కాలేజీ ఆస్తిపన్ను వివాదం తెరపైకొచ్చింది. సదరు యజమాని రెండేళ్లుగా ఆ భవనానికి సంభందించిన ఆస్తి పన్ను కట్టక పోవడంతో హైదరాబాద్ కూకట్ పల్లి అధికారులు భవనంలో కొంత భాగాన్ని సీజ్ చేశారు. ఏపీలో ఎందరో నారాయణ కాలేజీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన కేసుల్ని సైతం మంత్రి నారాయణ డబ్బు పలుకుబడితో మేనేజ్ చేసిన ఉదంతాలు అనేకం జరిగాయి. అయితే ఈ విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర అధికారులు ఎక్కడా వెనక్కు తగ్గక పోవడం గమనర్హం. నారాయణ ఏపీకి మంత్రిగానీ మాక్కాదు అనే దోరణిలో తెలంగాణ అధికారులు తమపని తాము చేసుకుపోయారు.

కూకట్ పల్లి వివేకానందనగర్ కాలనీకి చెందిన గుండాల రాఘవేంద్రరావుకు సప్తగిరి కాలనీలో  బిల్డింగ్ ఉంది. ఇందులో నారాయణ కాలేజీని నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా ఆస్తిపన్నును చెల్లించటం లేదు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బిల్డింగ్ ప్రధాన కార్యాలయంతో పాటు అకౌంట్స్ గదిని సీజ్ చేశారు.

విద్యార్థుల పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో.. బిల్డింగ్ మొత్తాన్ని సీజ్ చేస్తే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో సీజ్ చేయలేదని చెబుతున్నారు. అయినా.. బిల్డింగ్ యజమాని ఆస్తిపన్ను చెల్లించలేదనే అనుకుందాం. బిల్డింగ్ లో ఉన్న నారాయణ కాలేజీ సంస్థ కట్టేసి.. ఆ మొత్తాన్ని అద్దెలో కట్ చేసుకుంటే సరిపోయేదిగా. బిల్డింగ్ యజమాని.. నారాయణ కాలేజీ యాజమన్యం మధ్య ఏం జరుగుతుందో ఏమో కానీ.. ఈ సీజ్ వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అన్ని సామెతలు అన్ని వేళలా, అన్ని చోట్లా వర్కవుట్ కావు, కొన్ని చోట్ల బెడిసి కొడతాయి కూడా అనే సామెత నారయణ విషయంలో నిరూపితమైంది, ఎందరో విద్యార్థుల ఆత్మహత్యల కేసుల్ని ఇట్టే డీల్ చేసిన సదరు మంత్రికి ఈ వ్యవహారం పెద్ద లెక్క కాకున్నా, విషయం బయటకు పొక్కింది కాబట్టి రెండు మూడు రోజులు ఈ హడావిడి మామూలే అంటున్నారు జనం.