పాతబస్తీ రోబరీ కేసులో పోలీసుశాఖ పురోగతి

Posted on : 08/03/2018 09:18:00 am

హైదరాబాద్ పాతబస్తీలో బంగారు కార్ఖానా లో దోపిడీ దొంగలు సృష్టించిన భీభత్సం లో పోలీసు శాఖ ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ దోపిడీకి పాల్పడిన దొంగలు పక్కా ప్రొఫెషనల్స్ గా పోలీసులు గుర్తించారు. దోపిడీ జరిగిన ప్రదేశంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా పక్కా జాగ్రత్తలు తీసుకున్నారని సీసీ కెమేరాల కన్నుగప్పి అయిదు కేజీల బంగారాన్ని కొల్లగొట్టడం చూస్తుంటే పధకం ప్రకారం చేసిందేనని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఈ హైదరాబాద్ పాతబస్తీలో బంగారు కార్ఖానా లో దోపిడీ దొంగలు సృష్టించిన భీభత్సం లో పోలీసు శాఖ ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ దోపిడీకి పాల్పడిన దొంగలు పక్కా ప్రొఫెషనల్స్ గా పోలీసులు గుర్తించారు. దోపిడీ జరిగిన ప్రదేశంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా పక్కా జాగ్రత్తలు తీసుకున్నారని సీసీ కెమేరాల కన్నుగప్పి అయిదు కేజీల బంగారాన్ని కొల్లగొట్టడం చూస్తుంటే పధకం ప్రకారం చేసిందేనని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఈ కేసులో కీలకమైన ఆధారాన్ని పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీకి పాల్పడిన ఘటనలో వాడిన ఆటోను పోలీసులు గుర్తించడమే కాక ఆటోడ్రైవర్ ని అదుపులోకి తీసుకొని ఈ కేసుకు సంభందించిన మరికొన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

దోపిడీ జరిగిన విధానం, ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు దోపిడీకి పాల్పడ్డ దొంగలు ఈ ప్రాంతానికి చెందినవారు కాదని పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. దోపీడీ దొంగల కదలికలు ఆ ఏరియాలో సీసీ కెమేరాలు రికార్డు చేశాయని అయితే దుండగులు సైగలతోనే మొత్తం పనికానిచ్చారని పోలీసులు చెప్తోన్న దాని బట్టి తెలుస్తోంది. సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా దోపిడీ దొంగల కదలికలను విశ్లేషించేదుకు పోలీసు శాఖ12 బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపింది.

ఇదిలా ఉంటే ముంబైవాసి కార్ఖానా యజమాని నిత్యాదాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ సాగిస్తున్నారు. దోపిడీ జరిగిన తీరును బట్టి ముంబై, ఉత్తర ప్రదేశ్ కు చెందిన పక్కా ప్రొఫెషనల్ దొంగల ప్రమేయం ఉందని గుర్తించి ఆకోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఉద్యోగుల సహకారం లేనిదే ఇంతటి భారీ దోపిడీ సాధ్యం కాదని అనుమానించిన పోలీసులు ఇది వరకు అక్కడ పని చేసి మానేసిన వారిని సైతం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.