భారత ఐటీ ఉద్యోగుల చూపు జపాన్ వైపు

Posted on : 10/03/2018 12:31:00 pm

భారత ఐటీ నిపుణులకు జపాన్ దేశం తలుపులు తెరిచింది.  భారత ఐటీ నిపుణులకు ఫస్ట్ ఛాయిస్ గా నిలిచేందుకు జపాన్‌ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే భారత్‌ నుంచి రెండు లక్షల మంది ఉద్యోగులను  నియమించుకొనే దిశగా జపాన్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగం చేసే ఎవరికైనా సరే ఒక్కసారి అయినా అమెరికా వెళ్లాలనేది ఒక డ్రీమ్ గా ఉండేది. ఒక్కసారి అమెరికాలో కాలు పెడితే జీవితం సెటిల్ అవుతుందనే అభిప్రాయం ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ట్రంప్ విధానాలతో ఐటీ ఉద్యోగుల కల కలగానే మిగిలిపోయేటట్లు ఉంది. ఈ సమయంలో జపాన్  భారత ఐటీ రంగానికి భారీ ఆఫర్ ఇచ్చింది. భారత దేశ ఐటీ ఉద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడంతో ఈ వార్త విన్న ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. అమెరికా లేకపోతే ఏంటీ జపాన్ ఉంది అంటూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2లక్షల మంది అవసరం ఉందట. సంవత్సరం పని చేస్తే చాలు జపాన్ గ్రీన్ కార్డ్ కూడా ఇస్తాం అని ప్రకటించింది. ప్రధాన రంగాలైన నాన్స్, లైఫ్ సైన్స్, సర్వీస్, అగ్రికల్చర్ విభాగాల్లో పని చేసే ఐటీ నిపుణులు తమ దేశంలో పనిచేయడానికి కావాలని తెలిపింది. 

జపాన్ దేశంలో ఐటీ రంగం అభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులు కల్పించటానికి ఐటీ రంగాన్ని ఉపయోగించుకోవాలని, ప్రపంచంలోనే  ఐటీ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు జపాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షిజెకీ మైద తెలిపారు. రెండేళ్లుగా భారత ఐటీ రంగంలో ఉద్యోగాల నియామకాలు తగ్గుతూ వస్తున్నాయి. అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. భద్రత విషయంలో ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. ఈ క్రమంలోనే భారత ఐటీ నిపుణులను ఆహ్వానిస్తోంది జపాన్ దేశం. 2030 నాటికి 8 లక్షల మంది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ జపాన్ లో నివాసం ఉండేలా చర్యలు తీసుకోబోతోందని చెప్పారు. 

ప్రస్తుతం జపాన్ లో 9.2 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని... మరో 2 లక్షల మంది నిపుణుల కోసం డిమాండ్ ఉందని షిగేకి అన్నారు.  హెచ్‌-1బీ వీసాల విషయంలో అమెరికాలో తీవ్ర కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీయ ఐటీ నిపుణులకు ఇది గుడ్‌న్యూస్‌గా మారింది. కొత్త నిబంధనల ప్రకారం కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ ఉద్యోగ సర్టిఫికేట్‌ను, మల్టిపుల్‌-ఎంట్రీ వీసా వివరణ లేఖలను సమర్పించాల్సినవసరం లేదు. వీసా ప్రక్రియకు కావాల్సిన డాక్యుమెంట్లను కూడా తగ్గించి, కేవలం మూడు డాక్యుమెంట్లకే పరిమితం చేశారు. 

ఒకవేళ జపాన్‌కు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రయాణించి ఉన్నవారు, అటువంటివారు పాస్‌పోర్టు, వీసా అప్లికేషన్‌ ఫామ్‌ను సమర్పిస్తే సరిపోతుంది. సులభతరం చేసిన ఈ నిబంధనలు 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏ దేశం అయిన పర్వాలేదు అనుకునే వారికి జపాన్ ది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు.