సీజర్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అర్జున్ బంధువు

Posted on : 11/03/2018 12:42:00 pm

సినీ ఇండ‌స్ట్రీకి వార‌సుల రాక కొత్తేమి కాదు.  నటుల వారసులు కావొచ్చు, బంధువులు కావొచ్చు సినీ రంగప్రవేశం చేయడం కొత్తేమీ కాదు. అలా తమ ప్రతిభను నిరూపించుకున్న వారు చాలా మందే ఉన్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ ఇలా ప‌లు ఇండ‌స్ట్రీల‌లో వార‌సుల హ‌వా కొన‌సాగుతుంది. తాజాగా యాక్షన్‌కింగ్‌గా ముద్రవేసుకున్న నటుడు అర్జున్‌ బంధువు చిరంజీవి సార్జా ఇప్పుడు హీరోగా కోలీవుడ్‌కు రావడానికి సిద్ధం అవుతున్నారు. 

ఈయన నటిస్తున్న సినిమాకి సీజర్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక నేరం నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప‌రుల్ యాద‌వ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వి.ర‌విచంద‌ర్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని  ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి మ‌రో ముఖ్య విష‌యం ఏమంటే ఈ సినిమా క్లైమాక్స్‌ని శబరిమలైలో ఇంతవరకూ ఎవరికీ అనుమతించని ప్రాంతాల్లో చిత్రీకరించారట.  

సీజర్‌ సినిమా తమిళ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విన‌య్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అంజి, రాజేష్ క‌ట్టాల ద్వ‌యం ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ఈ సినిమాకి శాంత‌న్ శెట్టి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు.