మరోసారి భయపెట్టడానికి వస్తోన్న గీతాంజలి

Posted on : 11/03/2018 01:12:00 pm

ఓ సినిమా మంచి విజయం సాధిస్తే ఆ సినిమాను పరాయి భాషలలో రీమేక్ చేయడం లేదంటే ఆ సినిమాకి కొనసాగింపుగా మరో సినిమాను రూపొందించడం బాగానే జరుగుతున్నాయి. అచ్చ తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో, కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరోగా చేసిన సినిమా గీతాంజలి. అంజలి కెరీర్‌ను మ‌లుపు తిప్పిన సినిమాలలో గీతాంజలి ఒక‌టి అని చెప్పకోవచ్చు. ఈ సినిమాకి సీక్వెల్ రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

 తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు గీతాంజలి సినిమాకి సీక్వెల్ నిర్మిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం అంజలి టైటిల్ రోల్ పోషించిన హారర్ కామెడీకి రంగం సిద్ధం అవుతోంది.  తొలి సినిమాలో నటించిన శ్రీనివాస్ రెడ్డి, అంజలి ఈ సీక్వెల్‌లో కూడా ప్రధాన పాత్రలు పోషిస్తారని దాదాపు అదే టీంతో ఈ సినిమా చేస్తున్నారు. కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు అనే దర్శకుడు పరిచయం కాబోతున్నారు.  ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన రాబోతోంది. 

ఈ సినిమా మొదటి భాగం కంటే రెండవ భాగం ప్రేక్షకులను ఎక్కువగా భయపెట్టేలా ఉండేలా ఈ సినిమాని తీస్తున్నారని ఫిలిం నగర్ టాక్.  మొదటి భాగానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది హీరోయిన్ అంజలి. కోన వెంకట్ సమర్పించిన ఈ సినిమాకి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.