దబాంగ్ 3 డైరక్టర్ ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా

Posted on : 11/03/2018 02:21:00 pm

బాలీవుడ్ లో విజయంతమైన సినిమాల సీక్వెల్ గా బాలీవుడ్ కండల వీరుడు నటించిన 'దబాంగ్' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి కొనసాగింపుగా 'దబాంగ్ 2’ కూడా వచ్చి, మంచి ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా 'దబాంగ్ 3’ కూడా తీసుకరావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దబాంగ్‌ 3 నిర్మిస్తున్నట్టు వార్తలు రావడంతో ఆ సినిమా చర్చనీయాంశంగా మారింది. 'దబాంగ్‌ 3'ని ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నారని వార్త ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది. 

సల్మాన్ తో సినిమా చేయబోతున్న విషయం వాస్తవమే అని ప్రభుదేవా చెప్పాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ మళ్లీ పుంజుకున్నది ప్రభుదేవా దర్శకత్వం వహించిన వాంటెడ్ సినిమాతోనే. పోకిరికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది.  అందుకే ప్రభుదేవా మీద అతడికి ప్రత్యేక అభిమానం. దర్శకత్వం వహించమని అర్బాజ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఇద్దరూ సంయుక్తంగా చెప్పారు అని ప్రభుదేవా అడిగారట. సల్మాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఒదులుకొవడానికి ఎవరు సిద్ధపడరని ఆయన అన్నారట. సల్మాన్ ఖాన్ సూపర్ హీరో అని చాలా స్పెషల్ అని హిట్లు ఫెయిల్యూర్లతో సంబంధం లేని ఫాలోయింగ్ అతడిదని అన్నాడట ప్రభుదేవా. 

దబాంగ్‌, దబాంగ్‌ 2 లలో సల్మాన్‌కు జోడిగా సోనాక్షి సిన్హా నటించారు. ఈ  రెండింటిని నిర్మించిన సల్మాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌, తాజా చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. కొంత కాలంగా దర్శకత్వం పక్కన పెట్టి నటన మీద ఫోకస్ చేసిన ప్రభుదేవా మళ్లీ సల్మాన్ సినిమాతో దర్శకత్వంలోకి రీఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. దబాంగ్ సీరిస్ లో విడుదలైన సినిమాలు భారీగా కలెక్షన్లు రాబట్టడంతో, తాజా సినిమాపై పెద్ద ఎత్తున్న అంచనాలు నెలకొన్నాయి.