అమీర్ పేట్ టు అమెరికా సినిమా ట్రైల‌ర్ రిలీజ్

Posted on : 11/03/2018 03:16:00 pm

తేజస్, పల్లవి డోర, వంశీ కృష్ణ, మేఘన, వంశీ కోడూరి, సాషా సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తూ రాధా మీడియా బ్యానర్ పై రూపొందుతున్న సినిమా అమీర్ పేట్ టు అమెరికా. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాతో రామ్మోహన్ కొమండూరి, భాను కిరణ్ చల్లాలు డైరక్టర్లుగా పరిచయం కాబోతున్నారు. వీరిద్దరూ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొమండూరి పద్మజ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి  కార్తిక్ కొడకండ్ల సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. 

ఇనార్బిట్ మాల్ , ప్రసాద్ ఐమాక్స్, హైదరాబాద్ సెంట్రల్ మాల్ లో ఈ సినిమాలో నుండి బోనాల పాటను, పోతరాజులతో తెలంగాణా సంస్కృతి కళ్లకు కట్టినట్లుగా మొదటి సారిగా ఫ్లాష్ మాబ్ లాంటి వినూత్నమైన కార్యక్రమంతో ఆవిష్కరించారు. అతి త్వరలో జేఆర్ సి కన్వెన్షన్ హాలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత చెప్పారు. ఇంత వరకు ఏ సినిమాకి లేని విధంగా ఈ కర్త, కర్మ, క్రియ అనే పదప్రయోగానికి కారణం ప్రీ ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని క్రాప్ట్స్ లో తనవంతు సహాయ సహాకారాలను అందిస్తూ, పూర్తి ఇన్‌వాల్వ్‌మెంట్ తో ఆయన ఈ ఎ టు ఎ సినిమాను రూపొందించారు. 

యూత్ ఫుల్ లవ్ అండ్ కామెడీ , రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రెడీ అవుతున్న సినిమా ఎ టు ఎ. అద్భుతమైన పాటలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా త్వరలో వస్తున్న సినిమా  ఎ టు ఎ అని దర్శక, నిర్మాతలు తెలియజేశారు. ట్రైల‌ర్ చూసి సినిమాలోని కంటెంట్ నచ్చడంతో సురేష్ ప్రొడక్షన్స్, ఆషియన్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాని ఆంధ్ర, నైజాం ఏరియాల్లో రిలీజ్ హ‌క్కులను తీసుకున్నాయట. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.