సాయి ధరమ్ తేజ్ సినిమా టైటిల్ గా దేవుడు వరమందిస్తే..

Posted on : 11/03/2018 03:53:00 pm

మెగా వారసుడిగా టాలీవుడ్ కు పరిచయం అయి కొన్ని సినిమాల సక్సెస్ తో దూకుడు పెంచి ఆ తరువాత వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఈ మధ్య స్పీడ్ తగ్గించిన సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌. తొలిప్రేమ్ తో హిట్ కొట్టిన ఈ డైరెక్ట‌ర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు దేవుడు వరమందిస్తే అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.  తాజాగా ఆశ‌ల‌న్నీ కరుణాక‌ర‌ణ్ సినిమాపైనే పెట్టుకున్నాడట. రెండు షడ్యూళ్ల షూటింగ్ ను పూర్తిచేసుకుని త్వ‌ర‌లోనే మూడో షెడ్యూల్ కు వెళ్ల‌బోతోంది. ఈ సినిమా కోసం దేవుడు వ‌ర‌మందిస్తే టైటిల్ ను ఈ చిత్ర నిర్మాణ సంస్థ రిజిస్ట్ర‌ర్ చేయించిందని సమాచారం. 

క‌థ‌కు అనుగుణంగా ఉండబట్టే ఈ టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గోపి సుందర్  సంగీతం సమాకూరుస్తున్నాడు. ఇదివరకు చేసిన రొటీన్ మాస్ ఫార్ములా సినిమాలతో మొహం వాచిపోయిన ప్రేక్షకులకు సాయి ధరమ్ తేజ్ ఈ లవ్ స్టోరి తో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట. లవ్ స్టోరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కరుణాకరన్ సాయి ని లవర్ బాయ్ గా చూపించ బోతున్నాడట.  చాలా రోజుల నుండి కరుణాకరన్ కి సరైన హిట్ లేదు. ఇక ఎప్పటినుంచో  సాయి ధరమ్ తేజ్ కూడా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 

హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ భామ నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాల్ని నమోదు చేసుకున్నాయి. ఇక తెలుగు ప్రేమమ్ లో అలాగే శతమనం భవతి సినిమాతో హీరోలకు అదృష్ట లక్ష్మీ గా మారిపోయింది. ఇక అనుపమ  ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో ఉంది.   రామ్ హీరోగా ఉన్నది ఒకటే జిందగి, నాని-మెర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలతో బిజీగా ఉంది. అలాగే నాగ చైతన్య తో ఓ సినిమా,  ఇతర తమిళ్ -మలయాళం ప్రాజెక్ట్ లో కూడా అనుపమ నటిస్తోందని సమాచారం.