ప్రభాస్ తో జతకడుతున్న పూజా హెగ్దే

Posted on : 13/03/2018 10:29:00 am

దువ్వాడ జగన్నాథమ్‌ చిత్రంతో హీరోయిన్ పూజా హెగ్డే తన హవాను మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలంలో ప్రత్యేక గీతంలో నర్తించిన ఈ డీజే భామ త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో ఎంపికైందని సమాచారం. మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మొదలుకానున్న సినిమా కోసం కూడా పూజా హెగ్డేనే తీసుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఆమె చేసిన సాక్ష్యం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దువ్వాడ జగన్నాథం చిత్రంతో పూజా హెగ్డే దశతిరిగిందనే చెప్పాలి. వరుసగా అవకాశాల్ని అందుకొంటూ తన జోరును ప్రదర్శిస్తోంది పూజా హెగ్డే. తాజాగా ప్రభాస్ సరసన కూడా ఆమె ఎంపికైందని సమాచారం. సాహో తర్వాత విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కనున్న చిత్రం కోసమే పూజా హెగ్డేని కథానాయికగా ఎంపిక చేసుకొన్నట్టు తెలిసింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించ‌నుంది. వేసవి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ పొడుగు కాళ్ళ సుంద‌రి తెలుగు చిత్రాల్లో  అవకాశాలు అందుకొంటూనే, హిందీ చిత్రాలపై కూడా దృష్టిపెడుతోంది. సల్మాన్‌ఖాన్‌  రేస్‌ 3లో నటిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటోంది.