ఉగాది పండుగ రోజే రాజుగాడు టీజర్ రిలీజ్

Posted on : 13/03/2018 10:55:00 am

యువకథానాయకుడు రాజ్‌తరుణ్‌ ఇప్పుడు వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్న యంగ్ హీరో రాజ్‌త‌రుణ్‌ నటిస్తోన్న డిఫరెంట్ ఎంటర్‌టైనర్ రాజుగాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం టీజ‌ర్ ను ఉగాది రోజున రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై రాజ్‌త‌రుణ్ చేస్తోన్న చిత్రం రాజుగాడు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌తరుణ్ చేస్తోన్న నాలుగో చిత్రమిది. ఇదే నిర్మాణ సంస్థలో ఇంతకుముందు రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన ఈడోరకం-ఆడోరకం, కిట్టుఉన్నాడుజాగ్రత్త, అంధగాడు సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. 

ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకురాలు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. హీరోయిన్ గా అమైరా ద‌స్తుర్ నటించింది. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్న ఎంటర్‌టైనర్‌లో రాజేంద్రస్రాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించారు. ఇప్పటికే పూర్తయినా విడుదలపై ఇంకా క్లారిటీ లేదు. ఈ చిత్రానికి ఆర్ట్‌: కృష్ణ మాయ, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్‌, సంగీతం: గోపీ సుందర్‌, చీఫ్ కో డైరెక్ట‌ర్ః దాసం సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్  కిషోర్ గరికిపాటి. వేసవిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.