బాలీవుడ్ హీరోయిన్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనుందా?

Posted on : 13/03/2018 11:31:00 am

తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌పై బయోపిక్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ తేజ దర్శకత్వంలో నిర్మిస్తున్నవిషయం తెలిసిందే. దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖరున సెట్స్‌ మీదకు వెళ్లడానికి సిద్ధమయ్యింది. బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తుండగా, శర్వానంద్‌ జూనియర్ ఎన్టీఆర్ నటించ బోతున్నాడన్నని జోరుగా ప్రచారం జరుగుతోంది.  

ఎన్టీఆర్‌ సతీమణి పాత్ర ఎంపిక కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేశారని సమాచారం. ఆమె బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్. ఈమె బసవతారకం పాత్రలో అలరించనున్నారు. ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది.  ఎన్టీఆర్ బయోపిక్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఒక సామాన్య కుంటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ మహానటుడిగా ఎలా ఎదిగారన్నది, రాజకీయాల్లోకి ఎలా వచ్చారనే అంశాలను చూపించబోతున్నారు. బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో తెరకెక్కబోతుంది ఈ సినిమా. సాయి మాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు.