మెగా ఫ్యామిలీ మెగా హంగామా

Posted on : 13/03/2018 12:04:00 pm

మెగా ఫ్యామిలీ అంతా దాదాపుగా సెలబ్రిటీలే. మెగా ఫ్యామిలీ అంటేనే ప్రేక్ష‌కుల‌కి ఓ క్రికెట్ టీమ్ గుర్తుకొస్తుంది.  ఈ ఫ్యామిలీలో ఏదైన వేడుక జ‌రిగిందంటే ఆ హంగామానే వేరు. వీళ్లందరూ కలసి ఒకచోట కనిపిస్తే.  వైరల్‌ కాక ఏమవుతుంది మరి! తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులంతా  మొత్తం ఒక్కచోట చేరారు. మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒక్కచోట చేరి తెగ హంగామా చేశారు. అంతా కలసి సుష్మితకు విషెస్ చెబుతూ పుట్టిన రోజు వేడుకను ఎంజాయ్ చేశారు. ఈ ఫంక్షన్‌కు ఇటు మెగా కుటుంబంలో రామ్ చరణ్, ఉపాసన మినహా, అటు అల్లు కుటుంబంలోని యంగ్‌స్టార్స్ అంతా హాజరయ్యారు. 

రాజమౌళి చిత్రం కోసం ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఒక సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇపుడు అది వైరల్ అవుతోంది. సుస్మిత చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150 చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. సుస్మతి చిరంజీవి 151 వ చిత్రం సైరాకి సంబంధించిన‌ కాస్ట్యూమ్ వ‌ర్క్‌లో కూడా పనిచేస్తోంది. మెగా ఫ్యామిలీనంతా ఒక్కచోట చూసిన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.