మళయాళ సినిమాపై టాలీవుడ్ హీరో ఇంట్రెస్ట్

Posted on : 13/03/2018 12:34:00 pm

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ సౌత్ లోని ఇతర భాషల్లో ఆకట్టుకున్న సినిమాలని తెలుగులో రీమేక్ చేయడంలో అందరికన్నా ముందు వరసలో నిలుస్తాడు. కెరీర్‌లో లెక్కకు మించి రీమేక్‌లు చేశాడు వెంకటేష్‌. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆట నాదే వేట నాదే అనే సినిమాలో నటిస్తున్నాడు. తేజ ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. తాజాగా మలయాళంలో మమ్ముటి ప్రధాన పాత్రలో రూపొందిన ది గ్రేట్‌ ఫాదర్‌ అనే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మమ్ముట్టి చేసిన రోల్ చూసి వెంకటేష్ బాగా ఎక్సైట్ అయ్యాడని ఈ సినిమాని ఎలాగై చేయాలని చూస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. 

తాజాగా ఆ సినిమాని చూసిన తర్వాత వెంకటేష్ రీమేక్‌ రైట్స్‌ తీసుకునేందుకు సిద్దమయ్యాడని సమాచారం. వెంకటేష్‌ తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ సినిమా కావడంతో తెలుగులో తప్పకుండా విజయాన్ని దక్కించుకుంటుందన్న ఆశతో ఉన్నాడని తెలుస్తోంది. మలయాళంలో సుమారు 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ది గ్రేట్ ఫాదర్ మూవీ. తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరిస్తుందని వెంకీ ధీమాగా ఉన్నాడు.  త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని సమాచారం.