స్టార్ హీరోలను వెనక్కు నెట్టిన అర్జున్ రెడ్డి

Posted on : 13/03/2018 01:39:00 pm

పెళ్లి చూపులు సినిమాతో క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో మాస్ పేక్షకులపై తనదైన ముద్ర వేశారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ రేంజ్ ఒకేసారి టాప్ లోకి వెళ్లింది. ఈ సినిమా ఐఎండీబీ 2017 జాబితాలో ఏకంగా మూడో స్థానాన్ని సంపాదించుకుంది. తక్కువ వ్యవధిలో లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.  ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే ఆయన తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అడుగుపెడుతున్నట్టు తెలుస్తోంది. 

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ వచ్చేసింది. అంతకు ముందు చేసిన సినిమాల మాటేమిటో కానీ ఈ ఒక్క సినిమాతో ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయాడు.  పెద్దగా ఏ అంచనాలూ లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో యూత్‌లో విజయ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఈసినిమాలో యూత్‌ ఆడియన్స్‌ కు ఫేవరెట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ ఆన్‌లైన్‌ పోల్స్‌పై కూడా తన మార్క్ వేశాడు. విజయ్ తాజా పొజిషన్ ఏమిటో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవలసిందే. 

తాజాగా హైదరాబాద్‌ టైమ్స్‌ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్‌ మెన్‌ 2017 లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్‌లకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు విజయ్‌ దేవరకొండ. టాలీవుడ్ స్టార్ లను అందరినీ దాటుకుంటూ రెండవ స్థానంలో నిలిచాడు. హీరోస్ ప్రభాస్, మహేష్, చరణ్, అల్లు అర్జున్‌ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ప్లేస్ లలో నిలిచారు.