ఉగాది నుంచి నాగ్ - నానిల మ‌ల్టీస్టార‌ర్ రెగ్యులర్ షూటింగ్‌

Posted on : 13/03/2018 02:34:00 pm

కింగ్‌ అక్కినేని నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా వైజయంతి మూవీస్‌ పతాకంపై రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 18వ తేదీ ఉగాది పండగ రోజు నుంచి మొదలవుతోందని నిర్మాత సి.అశ్వనీదత్‌ తెలియజేశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మ‌ణిశ‌ర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ వైజయంతి పతాకంపై మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్‌ అయ్యాయని, ఈ చిత్రాన్ని కూడా హిట్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రంలోని పాటలకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్‌ చేస్తున్నారని, మూడు పాటలకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ అక్కడ జరుగుతున్నాయని, మార్చి 18వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుందని తెలిపారు. 

తమ సంస్థలో ఎన్నో మల్టీస్టారర్స్‌ వచ్చాయని, అవన్నీ కమర్షియల్‌గా ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయని, ఇప్పుడు నాగార్జున, నాని కాంబినేషన్‌లో వస్తోన్న మల్టీస్టారర్‌ కూడా పెద్ద హిట్టై, మరింత మంచి పేరు తెస్తుందని అని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్‌ డి. పట్టి, శ్రీరామ్‌ ఆర్‌. ఇరగం, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, కో-డైరెక్టర్‌: తేజ కాకుమాను, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌.